ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఘోరం జరిగింది. ఓ కొట్టంలో ఉంచిన 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతకు గురై, శ్వాస ఆడక మృతి చెందాయి. గొర్రెల యజమాని భీమనవేని రామన్న తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. రూ. 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు బోరుమన్నాడు.