Telangana Budget | తెలంగాణ రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసం.. జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలోనే నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,721 పోస్టులను కొత్తగా మంజూరు చేశామన్నారు. రూ. 1050 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.