హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 9 నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.577.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు మొత్తం రూ.5.51 కోట్ల విలువైన మద్యం, నగదు, బంగారు ఆభరణాలు, డ్రగ్స్, ఇతర ఉచితాలను సీజ్ చేశారు. వీటిలో రూ.200 కోట్ల నగదు, రూ.88.81 కోట్ల విలువైన మద్యం, రూ.32.64 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.178.83 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.77.01 కోట్ల విలువైన ఉచితాలు పట్టుబడినట్టు అధికారులు వివరించారు.