హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారానికి మొత్తం 575 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యలపై 185, హౌసింగ్‌కు 64 దరఖాస్తులు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖలకు సంబంధించి 50, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 43, హోం శాఖకు సంబంధించి 42 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 191 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.