IBPS | (ఎడ్యుకేషన్ డెస్క్, హైదరాబాద్): ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4455 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీవోబీ, బీవోఐ, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐవోబీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 20-30 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 21లోగా దరఖాస్తు చేసుకోవాలి. వీటితోపాటు ప్రభుత్వ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన కూడా విడుదలైంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://ibps.in చూడవచ్చు.