నిజామాబాద్, నవంబర్ 20 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఎన్నికల సమ యంలో అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను నిలువునా ముంచినట్టేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేము ల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు గొప్పగా చెబుతున్నా క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు వేగవంతంగా జరగడం లేదని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రైతు లు రోడ్లపైనే వడ్లను ఆరబోసుకుని, పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. బోనస్ ఎగ్గొట్టడానికే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. రైతులతో కలిసి పోరుబాట పడుతుందని హెచ్చరించారు.