హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : వేసవి, హోలీ సందర్భంగా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ద. మ రైల్వే ప్రకటించింది. మహబూబ్నగర్-రాజ్కోట్ రైల్వే స్టేషన్ల మ ధ్య 36 ప్రత్యేక రైళ్లు మార్చి నుంచి జూన్ వరకు షెడ్యూల్ వారీగా నడుస్తాయని పేర్కొన్నది. చర్లపల్లి నుంచి షాలీమార్, సత్రగాచి, జల్నా-పాట్నా రైల్వే స్టేషన్ల మధ్య 14 రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.