కార్వాన్, డిసెంబర్17 : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పై 50 శాతం సీలింగ్ అడ్డంకిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నాయకత్వంలోని ప్రతినిధుల బృందం న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయబద్దమైన ప్రాతినిధ్యం కల్పించాలంటే 50 శాతం సీలింగ్‌ను తొలగించడం అనివార్యమని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయని వాటిని తొలగించాల్సిన అవసరాన్ని మంత్రికి వివరించినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ, 243-టీ లను సవరించాలని మంత్రిని కోరినట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జనాభా మేరకు ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని స్పష్టం తన అభ్యర్థన పై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పసుపును ప్రపంచ మారెట్లలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అ న్నారు. బుధవారం సీఐఐ తెలంగాణ, జా తీయ పసుపు బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యుచైన్ సమ్మిట్-2025లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం నిర్వహించిన తెలంగాణ రైజిగ్ గ్లోబల్ సమ్మిట్‌లో అగ్రివిజన్-2047 ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యవసాయాన్ని కేవలం సంక్షేమరంగంగా కాకుం డా, రాష్ట్ర ఆర్థికవృద్ధికి ప్రధాన ఇంజన్‌గా చూస్తున్నామని తెలిపారు.
ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగ్ రావడం తెలంగాణ రైతులకు గర్వకారణమని పేర్కొన్నారు. నిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఒక క్వింటా ఉత్పత్తికి రైతు రూ.8,000-9,000 వరకు ఖర్చు చేస్తుండగా, మార్కెట్లో దాదాపు రూ.12,000 వరకే రావడం రైతులను నిరుత్సాహపరుస్తున్నదని వివరించారు. సమావేశంలో టర్మరిక్ బోర్డు చైర్మన్ గంగారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీశ్రీ, సీఐఐ తెలంగాణ చైర్మన్ శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.