హైదరాబాద్, సెప్టెంబర్ 7: బొమ్మలతో ఆట ఏడేండ్ల బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడేండ్ల నేహన్ బొమ్మల్లోని చిన్నపాటి అయస్కాంత గోళాలు మింగటంతో 48 గంటలపాటు తీవ్రమైన కడుపు నొప్పికి గురయ్యాడు. వైద్యులు సమయానికి ఆపరేషన్ నిర్వహించి బాలుడు పొత్తి కడుపు నుంచి 50 అయస్కాంత బాల్స్‌ను బయటకు తీశారు. విజయవాడలోని ఓ ప్రయివేటు దవాఖాన వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. అయస్కాంత బాల్స్‌తో తయారైన ఆటబొమ్మలతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. బొమ్మల్ని నోట్లో పెట్టుకున్నప్పుడు అయస్కాంత బాల్స్ చిన్న పిల్లలు మింగే అవకాశముందని వివరించారు. సమయానికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణపాయ పరిస్థితి ఏర్పడుతుందని, ఆపరేషన్ చేసినా ఐసీయూలో ఉంచాల్సి వస్తుందని తెలిపారు.