ఎడారి చెరకు తెర
ఓ హత్య కేసు లో దుబాయ్‌లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్నారు.
- సొంతూరికి మరో ఇద్దరు దుబాయ్ జైలు బాధితులు
- 20 ఏండ్లకు ఇంటికి చేరిన శివరాత్రి మల్లేశం, రవి
- ఫలించిన కేటీఆర్ 17 ఏండ్ల కృషి
- కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్: ఓ హత్య కేసు లో దుబాయ్‌లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్నారు. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు ఇంటికి చేరగా, బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) సొంతూరికి చేరారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తి మండలం రుద్రంగికి చెందిన నాంపల్లి వెంకటి (48), సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ అడ్డమీద కూలీలుగా పనిచేశారు. ఈ క్రమంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉ న్న నేపాల్‌కు చెందిన దిల్బహదూర్ 2005లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఈ ఐదుగురికి అక్కడి కోర్టు 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే తమ వారిని విడిపించాలని కుటుంబ సభ్యులు అప్పటి కాంగ్రెస్ పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
లాయర్ ఫీజులు చెల్లించిన కేటీఆర్
సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ 2009లో ఎన్నికవగా, బాధిత కుటుంబసభ్యులు ఆయనను కలిసి వేడుకున్నారు. వారి దయనీయ స్థితికి చలించిన కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. బాధిత కుటుంబానికి పరిహారం అందించి, వారి కు టుంబసభ్యులు క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష రద్దు అవుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ 2013లో స్వయంగా నేపాల్‌కు వెళ్లి దిల్బహదూర్ భా ర్యకు 15 లక్షలు అందజేసి క్షమాభిక్షకు మా ర్గం సుగమం చేశారు. ఆమె సంతకం చేసిన పత్రాలను కోర్టులో సమర్పించి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. వివిధ కారణాల వల్ల నేరతీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు క్షమాభిక్ష ప్రసాదించలేదు. ఈ కేసు వాదించేందుకు దుబాయ్ లాయర్‌కు ఫీజులు సైతం కేటీఆరే చె ల్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన కార్యాలయ అధికారులను దు బాయ్ పంపించి కేసును సమీక్షిస్తూ వచ్చారు. నిరుడు దుబాయ్ పర్యటనలో భారత కాన్సు ల్ జనరల్ కార్యాలయ అధికారులు, అక్కడి ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్లతో సమావేశమై చర్చించారు. క్షమాభిక్ష ప్రసాదించే విషయమై దుబాయ్ రాజుతో ప్రస్తావించాలని అక్కడి కాన్సుల్ రామ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ 17 ఏండ్ల ప్రయత్నాలతో కోర్టు ఇటీవలే క్షమాభిక్ష పెట్టింది.
ఒక్కొక్కరుగా ఇండ్లకు..
18 ఏండ్లు జైలులో మగ్గిన ఈ ఐదుగురికి విముక్తి లభించగా, ఒక్కొక్కరు విడుదలవుతూ స్వదేశానికి వస్తున్నారు. నెల కిందట కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48) విడుదలై ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి విడుదల కాగా, టికెట్లకు డబ్బుల్లేక ఆగిపోయారు. వారికి కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు. బుధవారం వారు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా రు. అప్పటికే కేటీఆర్ ఆదేశాలతో కుటుంబసభ్యులను బీఆర్ఎస్ నేతలు అక్కడికి తీసుకెళ్లా రు. అక్కడ తమవారిని చూడగానే భార్య, పిల్ల లు కన్నీటి పర్యంతమయ్యారు. ‘కొడుకులారా..? మిమ్మల్ని జన్మలో చూస్తామనుకోలేదు’ అంటూ వారి తండ్రి ఉద్వేగానికి లోనయ్యారు. తమ వారు కేటీఆర్ సార్ దయతోనే ఇంటికి చేరారని, సార్ సల్లంగా ఉండాలని కుటుంబీకులు తెలిపారు. కేటీఆర్‌కు కృతజ్ఞతగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. మరో వ్యక్తి చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (48) త్వరలోనే స్వదేశానికి రానున్నాడు.
కేటీఆర్ సార్ సాయంతోనే విడుదలయ్యాం
కేటీఆర్ సార్ సాయంతోనే మేము విడుదలయ్యాం. 30 లక్షల దాకా మా కోసం ఖర్చు పెట్టారు. 15 లక్షలు చనిపోయిన కుటుంబానికి 2013లోనే ఇచ్చిండ్రు. దుబాయ్‌లో న్యాయసేవల కోసం 13 లక్షలు, ఇతర ఖర్చులు పెట్టి ఇయ్యాల ఇంటి దాకా రప్పిచ్చిండ్రు. ఇయ్యాల మావాళ్లను చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. కేటీఆర్ సార్ దయతోనే వాళ్లను చూస్తున్నం. సార్‌కు రుణపడి ఉంటాం.
– శివరాత్రి మల్లేశం, పెద్దూరు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

