హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో నిర్మాణం పూర్తికాని 69వేల డబు ల్ బెడ్రూమ్ ఇండ్ల కు రూ. 5లక్షల చొప్పున అందించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాలపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పారు.
కేంద్రం చేతుల్లోనే రిజర్వేషన్లు: సీతక్క
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతుల్లో ఉందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెం ట ర్ వద్ద సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.
ఆంధ్రాకేనా నిధులు: మంత్రి సురేఖ
కాశీబుగ్గ, జూన్ 16 : గోదావరి పు ష్కరాల నిధుల విషయంలో కేంద్రం రాష్ర్టానికి అన్యాయం చేసిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సోమవారం వరంగల్ ఓసీటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నిధుల్లో ఏపీకి ఒక న్యా యం, తెలంగాణకు ఒక న్యాయ మా..? అని ప్రశ్నించారు. కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు.