మాజీ ఎంపీటీసీకి 5 లక్షల జరిమానా
పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఓ మాజీ ఎంపీటీసీకీ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన ఫలితమిది
కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 6 : పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఓ మాజీ ఎంపీటీసీకీ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రేణికుంట చిన్న రాయుడు భోగంపాడు, సిరిసేడు గ్రామంలో ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎంపీడీవో విచారణ జరిపారు. విచారణలో పల్లెప్రకృతి వనం ధ్వంసం చేయడం నిజమేనని తేలడంతో నివేదికను కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ పరిశీలించి వాల్టా చట్టం ప్రకారం రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆర్ఆర్ యాక్టు ప్రకారం తదుపరి చర్యలు తీసకుంటామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

