వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం వెలమల ఆత్మగౌరవ భవనానికి హైదరాబాద్లో 5 ఎకరాల స్థలం కెటాయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) తెలిపారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం 28వ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వెలమ సంఘానికి, సభ్యులకు అభినందనలు తెలిపారు.
వెలమల్లో అందరినీ కలుపుకుని పోయే లక్షణం, సేవా తత్పరత గుణం ఉండడం వల్ల జనాభాలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఉన్నత పదవులు వస్తున్నాయని వివరించారు. పేద వెలమల(Poor Velmas)ను ఆర్థికంగా(Financially) ఎదిగేందుకు సహకారం అందించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా వెలమ సంక్షేమానికి ఎప్పుడూ లేనంతగా కృషి జరుగుతున్నదని అన్నారు.
ఓసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల(Reservations)లో వెలమలకు కూడా లాభం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, సంఘం అధ్యక్షుడు పేరాల మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ రావు, ప్రభాకర్ రావు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా వెలమ సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.