హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): ఇటీవల మృతిచెందిన కళాకారుడు కరుణాకర్ కుటుంబానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రూ.5,48,000 ఆర్థిక సహాయం అందించారు. బుధవారం హైదరాబాద్లో సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారుల బృందం.. కరుణాకర్ కుటుంబసభ్యులకు చెక్కు అందజేసింది. ఆలేరుకు చెందిన కరుణాకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.