హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన వ్యక్తిని రూ.5.27 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది నిందితుడిని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లోని పూర్బ మెడినిపూర్ జిల్లా కొంటై నగరానికి చెందిన సైదుల్ ఇస్లాంఖాన్ జూలైలో హైదరాబాద్కు చెందిన వ్యక్తిని ఫేక్బుక్లో స్టాక్ రికమెండేషన్ల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పి రూ.5.27కోట్ల మేర మోసం చేశాడని పోలీసులు తెలిపారు.