హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేలా న్యూట్రీహబ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ, ఆహార ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్తలకు స్పెషల్ గ్రాంట్‌గా రూ.5.25 లక్షలను ఇవ్వనుంది.
ఔత్సాహికులు ఆగస్టు 20 వరకు www.millets.res.in లేదా https://www.nutrihubiimr.com/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, స్టార్టప్ కల్చర్‌ను విస్తరించడమే లక్ష్యంగా రాజేంద్రనగర్‌లోని మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుబంధ సంస్థ న్యూట్రీహబ్ ఆధ్వర్యంలో ఈ గ్రాంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.