రాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 48ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు అధికారులు బుధవారం తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 13వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నాందేడ్-పన్వేల్ మధ్య 24, కొచువెల్లి-నిజాముద్దీన్ మధ్య 16, పుణె-కరీంనగర్ మధ్య 8 సర్వీసులను ఏర్పాటు చేశారు. అలాగే గోరఖ్పూర్-మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక సర్వీసులు పొడిగించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21, 22 తేదీల్లో సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.