Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిన్న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా బుధవారం వెల్లడించారు. గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 52.76 శాతం, 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023లో 47.58 శాతం పోలింగ్ నమోదైంది.
2023 సాధారణ ఎన్నికతో పోల్చితే ఈ ఉప ఎన్నికలో 0.91 శాతం పోలింగ్ పెరిగింది. మొత్తం 4,01,365 ఓటర్లకు గానూ 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నాటికి పూర్తిస్థాయి ఫలితం వెలువడనుంది. కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.