హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మోహదీపట్నం నుంచి అత్తాపూర్ ‘మొగల్ కానాలా’లో రూ. 46 లక్షల విలువ చేసే హషీష్ ఆయిల్, గంజాయిని పట్టుకున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఎక్సైజ్ భవన్లో బుధవారం కేసు వివరాలను వెల్లడించారు. కడపకు చెంది న సాధిక్‌వలీ, రంపచోడవరానికి చెందిన హరికుమార్, సత్యనారాయణ హైదారాబాద్‌కు 4.2 కిలోల హషీష్ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పట్టుకున్నది. మరో బృందాన్ని రాజమండ్రికి పంపించి అక డి నుంచి 70.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నది. హషీష్ ఆయిల్, గంజాయి విలువ రూ. 46 లక్షల మేర ఉంటుంది.