హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీకి చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో భోజన సదుపాయం, వసతి కల్పిస్తున్నారు. అక్కడి నుంచి విమానాల్లో హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. తెలంగాణ విద్యార్థుల యోగక్షేమాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వివరించారు. మరో 350 మంది వరకు తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.