హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో 4,416 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,670, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డిలో 301, హనుమకొండలో 178, ఖమ్మంలో 117, మహబూబ్‌నగర్, సంగారెడ్డిలో 99, మంచిర్యాలలో 92, కరీంనగర్లో 91, నల్లగొండలో 90, యాదాద్రి భువనగిరిలో 89, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 కేసులు నమోదయ్యాయి. మొత్తం 29,127 యాక్టివ్ కేసులున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటిన్ పేర్కొన్నది. తాజాగా 1,920 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 95.43 శాతం, పాజిటివిటీ రేటు 3.67 శాతంగా నమోదైంది.
శుక్రవారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
వివరాలు శుక్రవారం మొత్తం
పాజిటివ్ కేసులు 4,416 7,26,819
డిశ్చార్జి అయినవారు 1,920 6,93,623
మరణాలు 2 4,069
చికిత్స – 29,127
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 2.38 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 54 వేల మందికి మొదటి డోస్, 1.73 లక్షల మందికి రెండో డోస్, 10 వేల మందికి బూస్టర్‌డోస్ వేశారు. 15-18 ఏజ్ గ్రూప్‌లో ఇప్పటివరకు 57 శాతం మందికి (10.49 లక్షలు) మొదటి డోస్ పంపిణీ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37.99 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కలిపి 53,535 పడకలు ఖాళీగా ఉన్నాయి.