మంచిర్యాల, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.43.70 లక్షలు పట్టుబడ్డాయి.
ఇందులో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.39 లక్షలు, తాండూర్ మండలం రేపల్లెవాడ చెక్‌పోస్టు వద్ద రూ.లక్ష, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి జాతీయ రహదారిపై రూ.1.20 లక్షలు, జైనూర్‌లో రూ.83 వేలు, దహెగాం మండలం కల్వాడ్ గ్రామ చెక్‌పోస్టు వద్ద రూ.1,67,078ను పోలీసులు పట్టుకున్నారు.