హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఐదేండ్లలో మొత్తం 4,194 డ్రగ్స్ కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. 2021 నుంచి 2025 ఆక్టోబరు వరకు 7,131 మందిపై కేసులు నమోదు చేశారని, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న 1,824 వాహనాలను సీజ్ చేశారని పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించే ‘నషాముక్త్ భారత్’ సందర్భంగా ఆయన పలు వివరాలు మీడియాకు వెల్లడించారు. 24,236 కేజీల గంజాయిని, 21,035 గంజాయి మొకలను, 115 కేజీల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 2803.13 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 689 ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, 46.47 కేజీల హ్యాష్ అయిల్, 383.3 గ్రాముల కొకైన్, 701.3 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనపర్చుకున్నట్టు వెల్లడించారు.