హైదరాబాద్, సెప్టెంబర్20 (నమస్తే తెలంగాణ): జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 401 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్ర త్యేకాధికారి వినతిపత్రాలు స్వీకరించా రు. ఈ సందర్భంగా రెవెన్యూకు 116, విద్యుత్, సింగరేణికి 51, ఎస్సీ సంక్షేమ శాఖకు 46, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 45, హోంశాఖకు 28, ఇతర శాఖలకు 115 వినతులు వచ్చిన ట్టు ప్రత్యేకాధికారి వెల్లడించారు.