అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 26: రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ గాడి తప్పింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులం సమస్యలకు కేరాఫ్‌గా మారింది. 6నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ 600మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వైరల్ ఫీవర్లు, విషకీటకాలు, ఎలుకలు, దోమల స్వైరవిహారంతో నిద్రాహారాలు మానుకొ ని భయం.. భయంగా చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవలే ఇద్దరు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేసినా తీరు మారడంలేదు
40 మందికి వైరల్ ఫీవర్
అలంపూర్ చౌరస్తా గురుకుల పాఠశాల భవనానికి తలుపులు, కిటికీలు లేకపోవడం.. చుట్టూ ముళ్లపొదలు, వర్షపు నీరు నిల్వ, దోమలు, ఈగలతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. సోమవారం 40మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చింది. 100 పడకల దవాఖానకు తరలించి పరీక్షలు చేయించారు. 13మంది విద్యార్థులకు తగ్గకపోవడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి, ఇండ్లకు పంపించారు.
ఎలుకలతో అవస్థలు
గురుకుల పాఠశాలలో ఎలుకలతో విద్యార్థు లు సహవాసం చేస్తున్నారు. సోమవారం ఆరుగురిని ఎలుకలు కరిచాయి. దవాఖానకు వెళ్లి చి కిత్స చేయించారు. వంట గదిలో ఎలుకలు సరుకులను తింటుండడం.. వాటితో వంట చేయడంతో అస్వస్థతకు గురవుతున్నట్టు తెలిసింది.
జ్వరాలు వస్తే చూయిస్తున్నాం
గత వారంలో కురిసిన వర్షాలతో విద్యార్థులకు జ్వరాలు వస్తే దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు చేయించి మందులు అందించాం. పరిస్థితి సీరియస్‌గా ఉన్న విద్యార్థులను వారి ఇండ్లకు పం పిం చాం. ఎలుకల బెడద నివారించుటకు చర్యలు తీసుకుంటున్నాం.
– రామకృష్ణ, ప్రిన్సిపాల్, అలంపూర్ చౌరస్తా