మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 4: మహబూబ్‌నగర్‌లోని మోతీనగర్‌కు చెందిన ప్రభాకర్ కూతురు హరిప్రియ (4వ తరగతి) మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నది. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మోతీనగర్ వచ్చిన మంత్రి కాన్యాయ్‌ను చూసి పలువురు చిన్నారులు మంత్రి వాహనాన్ని ఆపారు.
చిన్నారులను చూసిన మంత్రి.. తన వాహనాన్ని ఆపి కిందికి దిగారు. చిన్నారి హరిప్రియ తను పొదుపు చేసుకున్న కిడ్డీ బ్యాంక్‌ను తెచ్చి మంత్రికి ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఖర్చుల కోసం తన వంతు సాయంగా అందిస్తున్నట్టు తెలిపింది. చిన్నారి హరిప్రియ తనపై చూపుతున్న అభిమానానికి మంత్రి ఫిదా అయ్యారు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అన్నట్టు.. అందరి ఆదరాభిమానాలతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.