KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతిక అనే నాలుగేండ్ల చిన్నారి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటింది. జనవరిలో వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన కృతికకు కేటీఆర్ వైద్యం చేయించి, ఆ పాపను ప్రాణాలతో కాపాడారు. దీంతో తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్ పట్ల కృతిక గొప్ప మనసు చాటుకుంది. రాఖీ పండుగ సందర్భంగా తన తల్లితో కలిసి కేటీఆర్కు రాఖీ కట్టి అభిమానాన్ని చాటింది కృతిక.
రామంతాపూర్ రాంరెడ్డినగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న కృతిక(4)పై వీధి కుక్క దాడి చేసిన సంగతి తెలిసిందే. వీధి కుక్క చిన్నారి మొహం, చెవి కొరికింది. కుక్క దాడిలో చిన్నారి చెవి సగం తెగిపోయింది. గాయాలపాలైన చిన్నారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేటీఆర్ తక్షణమే స్పందించి కృతికకు కావాల్సిన వైద్యం చేయించారు.