హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు అమలు చేస్తున్న జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసింది.
ఒకో మెడికల్ కాలేజీ, అనుబంధ హాస్పిటల్‌కు వివిధ క్యాటగిరీల్లో కలిపి 433 పోస్టులను సృష్టించింది. ఈ మేరకు ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసింది.
21 కాలేజీలు.. 15,476 పోస్టుల సృష్టి
తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వం ఇప్పటివరకు 12 మెడికల్ కాలేజీలను ఏర్పా టు చేసింది. వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలకు కలిపి ప్రభుత్వం 15,476 పోస్టులను మంజూరు చేసింది. అంటే 15,476 ఉద్యోగాలను సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ మొదటి దశలో మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. రెండో దశలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య ఎనిమిదేండ్లలో 17కు పెరిగింది. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాదికి 2,790కి పెరిగాయి.
ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు: మంత్రి హరీశ్‌రావు
అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను అందించే లక్ష్యంలో ఇది గొప్ప ముందడుగు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. కొత్త మెడికల్ కాలేజీలతో నాణ్యమైన వైద్యంతోపాటు వైద్యవిద్య ప్రజలకు చేరువవుతున్నది.
ఒకో కాలేజీకి కేటాయించిన పోస్టులు ఇలా..
ప్రొఫెసర్ : 25
అసోసియేట్ ప్రొఫెసర్ : 29
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 60
మైక్రో సోషల్ వరర్ (గ్రేడ్ వన్) : 1
మైక్రో సోషల్ వరర్ (గ్రేడ్ 2) : 2
సివిల్ అసిస్టెంట్ సర్జన్ : 1
మెడికల్ ఆఫీసర్ : 8
హెల్త్ ఇన్స్పెక్టర్ : 2
హెల్త్ ఎడ్యుకేటర్ : 2
రికార్డ్ క్లరు : 2
ఈఎన్టీ టెక్నీషియన్ : 1
బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ : 2
లైబ్రేరియన్ : 1
అసిస్టెంట్ లైబ్రేరియన్ : 1
మెడికల్ రికార్డ్ ఆఫీసర్ : 1
స్టాటిస్టిషియన్ : 1
నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్ 1) : 1
నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్ 2) : 1
హెడ్ నర్స్ : 5
స్టాఫ్ నర్స్ : 203
సీఎస్ ఆర్ఎంవో : 2
డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవో : 1
సీఏఎస్ ఆర్ఎంవో : 4
డైటీషియన్ : 1
ఫార్మసీ సూపర్వైజర్ : 1
ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) : 5
ఫార్మసిస్ట్ (గ్రేడ్ వన్) : 1
హెల్త్ ఇన్స్పెక్టర్ : 1
ప్రిన్సిపాల్ : 1
అసిస్టెంట్ డైరెక్టర్ : 2
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 4
ఆఫీస్ సూపరింటెండెంట్ : 6
సీనియర్ అసిస్టెంట్ : 6
జూనియర్ అసిస్టెంట్ : 13
మెడికల్ సూపరింటెండెంట్ : 1
ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ 2) : 24
ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ వన్) : 5