Nirmal | నిర్మల్ : వ్యక్తిగత కారణాలతో ఓ వైద్యురాలు( Doctor ) ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్( Hyderabad )లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ బీనా( Doctor Beena ).. నిర్మల్లోని బాలాజీ ఈఎన్టీ హాస్పిటల్( Balaji ENT Hospital )లో పని చేస్తోంది. స్థానికంగా ఉన్న ఏఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటుంది. డాక్టర్ బీనాకు ఐదేండ్ల క్రితం వివాహమైంది. కాగా భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు.
అయితే సోమవారం ఉదయం బీనా తన ఇంట్లోనే కత్తితో గొంతు గోసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న బీనాను చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఆమెను స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే బీనా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్మల పట్టణ సీఐ మల్లేష్ తెలిపారు.