శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 3: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 35 కిలోల బంగారు, 40 కిలోల వెండి ఆభరణాలను ఓమిని కారులో హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.
ఆభరణాలకు సంబంధించిన పత్రాలు, బిల్లులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని, ఏడుగురిని అదుపులోకి తీసుకొని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎన్నికల స్కాడ్ అధికారులకు కేసును అప్పగించినట్టు ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.