ఏజెన్సీలో రవాణా మెరుగుకు 340 కోట్లు
ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రూ.340 కోట్లు మంజూరైనట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
- మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి
- నాగోబా వద్ద గిరిజన దర్బార్
ఉట్నూర్, జనవరి 24: ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రూ.340 కోట్లు మంజూరైనట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో గిరిజన దర్బార్‌కు ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా గిరిజనుల నుంచి సుమారు 277 అర్జీలను స్వీకరించారు. అంతకుముందు నాగోబా దేవతకు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు.. మంత్రులు, నాయకులు, అధికారులను శాలువాలతో సత్కరించి, నాగోబా చిత్రపటాలను బహూకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దర్బార్‌లో మంత్రులు మాట్లాడుతూ.. నాగోబా ఆలయంతోపాటు, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.12.50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గిరిజనుల పోడు భూములకు పట్టాలు అందజేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి వెంకట్రావు, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్ప, జడ్పీచైర్మన్లు రాథోడ్ జనార్దన్, లక్ష్మి, ఎమ్మెల్సీలు విఠల్, రఘోత్తంరెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

