హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల పెన్షన్ ట్రస్టుకు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన రూ. 3,392కోట్ల బకాయిలను ఇప్పించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీ స్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 6న జరగబోయే ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం లో ఈ అంశాన్ని చర్చించి, పరిష్కారించాలని కోరిం ది. ఈ మేరకు జేఏసీ నేతలు బుధవారం హైదరాబాద్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రాన్ని సమర్పించారు.
రాష్ట్ర విభజన సమయం లో పెన్షన్ ట్రస్టు నిధులు ఏపీకే వెళ్లాయని, ఇలా ఏపీ జెన్కో నుంచి రూ. 2,478 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ. 914 కోట్లు మొత్తంగా రూ. 3,392 కో ట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోకు రావాల్సి ఉందని వీటిని సత్వరమే ఇప్పించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రూ. 28, 842 కో ట్లు, తెలంగాణ జెన్కోకు విద్యుత్తు కొనుగోలుకు సం బంధించిన రూ. 9,500కోట్లు రాష్ట్ర ప్రభుత్వం త్వ రగా విడుదల చేయాలని, రామగుండంలో 800 మోగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని జెన్కో ద్వారానే ని ర్మించాలని, సింగరేణి సంస్థకు కేటాయించొద్దని విజ్ఞ ప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీరెడ్డి, వైస్‌చైర్మన్ అనిల్‌కుమార్, వేణు, ఏ వెంకటనారాయణరెడ్డి, పీ సదానందం, అబ్దుల్ తఖీ, కుమారస్వామి ఉన్నారు.