హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వినూత్నమైన పన్ను మోసాన్ని బట్టబయలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఖాళీ వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించి, భారీగా సరుకులు రవాణా జరిగినట్టు చూపించి రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్టు వెల్లడైంది. అధికారులు ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీకి చెందిన సికింద్రాబాద్లోని కార్పొరేట్ కార్యాలయం, బన్సీలాల్పేట్లోని గోదాం, మెదక్ జిల్లా కాలకల్లోని ఆటోమోటివ్ పార్, ముప్పిరెడ్డిపల్లిలోని తయారీ యూనిట్ తనిఖీలు నిర్వహించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ సంస్థ అసలు ఏ విధమైన సరుకులు తరలించకుండానే భారీ విలువ కలిగిన రాగి పరికరాలను రవాణా చేసినట్టు చూపించి బిల్లులు జారీ చేసినట్టు అనుమానం వచ్చింది. ఖాళీ వాహనాలను తెలంగాణ నుండి మహారాష్ట్రకు పంపించి, డాక్యుమెంట్లలో భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించారు. సంస్థ డైరెక్టర్లు వికాస్ కుమార్ కీషాన్, రజనీశ్ కీషాన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులు సీసీఎస్కు ఫిర్యాదు చేశారు.