Group-1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరవుతున్నారు. బుధవారం వరకు 32 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 31,403 మందికి 21,429 మంది (68శాతం) అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రశ్నపత్రం తీరుపై మిశ్రమ స్పందనలొచ్చాయి. ప్రశ్నలు పొడవుగా ఉన్నట్టుగా దీంతో అర్థం చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డట్టుగా అభ్యర్థులు తెలిపారు. పరీక్షలో పురాతన, మధ్యయుగ, ఆధునిక, చరిత్ర నుంచి ప్రశ్నలిచ్చారు. అలాగే తెలంగాణ ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం ప్రాముఖ్యం, దాని లక్ష్యాలు, ప్రయోజనాలపై ప్రశ్న ఇచ్చారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని చేపట్టగా అది విజయవంతమైంది.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమ స్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో త్వరలో 599 ఎక్స్టర్నల్, మరో 300 కారుణ్య నియామకాలను పూర్తిచేయనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. రెండు వారాల్లో ఉద్యోగాలను భర్తీచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి భవన్ నుంచి రిక్రూట్మెంట్పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.