ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని మార్కెట్ యార్డు వెనకాల ఉన్న ఇందిరానగర్‌లో రవితేజ అనే యువకుడిని దుండగులు కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుడిది ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్ అని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు హత్య జరిగినట్లు తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. దుంగడులను గుర్తించేందుకు మార్కెట్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు.