నల్లగొండ ప్రతినిధి, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై, భౌగోళిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ.. భట్టి పాదయాత్ర రోజుకు మూడు కిలోమీటర్లు కూడా సాగడం లేదని, కాంగ్రెస్ అంతర్గత కలహాల యాత్రని ఎద్దేవా చేశారు. ఎస్సెల్బీసీ సొరంగమార్గం ఉద్దేశమే తెలియని భట్టి దానిని పూర్తి చేయలేదంటూ ఆరోపణలు చేయడం తగదనన్నారు. సొరంగమార్గంతో నీరందించాల్సిన 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికే ఏఎంఆర్పీ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతున్నదని స్పష్టం చేశారు.
1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం సాగర్ బ్యాక్‌వాటర్ ఎత్తిపోతలకు ఏఎంఆర్పీ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాసర్‌రెడ్డి ప్రభుత్వం అటకెకించిందని గుత్తా తెలిపారు. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుకు వైఎస్సా ర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ అప్పటికే ఏఎంఆర్పీని పూర్తి చేసి 93 చెరువులను నింపి, మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించే పనులు పూర్తకావొచ్చాయన్నారు.
సొరంగమార్గం ప్రాజెక్టుకు లభించిన కఠినమైన పర్యావరణ అటవీ అనుమతులు, టీ బీఎం మిషన్స్, వ రద నీరు సమస్యలతో తవ్వకం ప నులు ఆలస్యం అ వుతున్నాయని గు త్తా వివరించారు. 43 కి.మీ.కు 34 కి.మీ. సొరంగం పూర్తయిందని, శ్రీశైలంలో నీటి నిల్వలతో ఇన్లెట్ పనులు ఆగిపోయాయని, ఔట్లెట్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు సమీక్ష చేసి పనుల వేగవంతం కోసం ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎస్సెల్బీసీ కాంట్రాక్టర్ జయప్రకాశ్ సంస్థను పిలిచి, ఏటా వంద కోట్ల అడ్వాన్స్, విద్యుత్తు బిల్లులు చెల్లిస్తూ పనులు జరిపించేలా ఏర్పాటు చేశారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే.. భట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజల కోసం రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టగా.. కాంగ్రెస్ నేతలు కోర్టు స్టేలతో అడ్డుపడ్డారని గుత్తా విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతలకు సీఎం కేటాయించారని చెప్పారు. డిండి పూర్తయ్యేదాకా ప్రాజెక్టులో 3.5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ సీం కూడా ట్రయ ల్ రన్ పూర్తయిందని చెప్పారు. ఉదయ స ముద్రం కింద లక్ష ఎకరాలకు సాగునీటి వస తి లభిస్తుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ మే ఎస్సారెస్పీ రెండో దశ కాల్వలకు కాళేశ్వ రం ప్రాజెక్టుతో నీళ్లు అందిస్తున్నదన్నారు. నల్లగొండ జిల్లాలోని ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు అసలు ప్రజలంటే పట్టరని, వారి పనితీరుపై సర్వే చేయిస్తే అందులో 5.5% బాగుందంటే 69% బాగాలేదు అన్నారని వెల్లడించారు.