మెదక్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవాలు, క్రిస్మిస్ పండుగ కలిసి రావడంతో బుధవారం లక్షలాది మంది భక్తులు చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉదయం 11.45 గంటలకు మెదక్ చర్చి ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. 12 గంటలకు ప్రార్థనలో పాల్గొనాలి. కానీ రెండు గంటల పాటు ఆలస్యంగా రావడంతో చర్చికి వచ్చిన భక్తులు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఏసు కంటే సీఎం ఎక్కువ కాదని క్యూలో నిల్చున్న భక్తులు వాపోయారు. క్రిస్మస్ రోజు పిల్లాపాపలతో ఎక్కడి నుంచో మెదక్ చర్చికి వస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని చీదరించుకున్నా రు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పు డూ ఇలా జరగలేదని మహిళలు వాపోయారు. సీఎం వచ్చి వెళ్లేంతవరకు పోలీసులు భక్తులను చర్చి లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు.