రఘునాథపల్లి, అక్టోబర్ 24: జనగామ జిల్లా కోమాళ్ల టోల్గేట్ వద్ద రూ.3 కోట్ల విలువైన బంగారాన్ని సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి బీవీసీ లాజిస్టిక్ వాహనంలో టైటాన్, మలబార్ గోల్డ్ షాప్‌లకు సంబంధించిన బంగారాన్ని సరైన అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్నారు. ఇందులో టైటాన్ కంపెనీది 2506.56 గ్రాము లు, మలబార్ గోల్డ్‌కు సంబంధించిన 2934.836 గ్రాముల బంగారం ఉన్నది. మొత్తం 5 కిలోల 441 గ్రాములకు గాను దీని విలువ రూ. 3.9 కోట్లు ఉంటుందని పోలీసు లు అంచనా వేశారు. కేసు నమోదు చే సుకొని దర్యాపు చేస్తున్నట్టు స్టేషన్‌ఘన్‌ఫూర్ ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు.