హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : యూటీఎస్ మొబైల్ యాప్‌లో ఆర్-వాలెట్ ద్వారా రైల్వే జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు 3% డిస్కౌంట్ ఇస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. 2016లో తొలుత హైదరాబాద్ జంట నగరాలల్లో 26 సబర్బన్ స్టేషన్లలో ‘యూటీఎస్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆర్-వాలెట్‌తోపాటు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, యూపీఐ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.