హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ‘వికసిత్ భారత్ 2047- సాంకేతికత పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటా 10 నిమిషాలు, చెన్నైకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు.