కృష్ణమ్మకు భారీగా వరద
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీశైల జలాశయానికి వరద భారీగా వస్తున్నది. గురువారం 3,54,343 క్యూసెక్కుల వరద రాగా 10 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు.
- శ్రీశైలం ప్రాజెక్టుకు 3.54 లక్షల క్యూసెక్కులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15 : కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీశైల జలాశయానికి వరద భారీగా వస్తున్నది. గురువారం 3,54,343 క్యూసెక్కుల వరద రాగా 10 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా 3,81,698 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు 2.60 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, డ్యాం 43 గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్‌ఫ్లో 2,55, 140 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 53,270 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 52,800 క్యూసెక్కులుగా ఉన్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 58,109 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 46,581 క్యూసెక్కులుగా నమోదైంది.
18 క్రస్ట్ గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతున్నది. సాగర్ ప్రాజెక్టుకు గురువారం 3,81,698 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా మొత్తం 3,07, 785 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 588.90 (308. 7614 టీఎంసీలు) అడుగుల ఉన్న ది. మూసీ ప్రాజెక్టుకు 6,539.11 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ప్రాజెక్టు నుంచి 4,547 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

