శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 18: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 22న కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు సంబంధించిన ఇనుపపెట్టెలో దాదాపు రూ.1.25 కోట్ల విలువైన బంగారం ఉన్నట్టు గుర్తించారు.
అయితే, ఆగస్టు 22న సదరు బంగాన్ని ఆ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అధికారులు.. నిందుతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఈ నెల 16న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన్నట్టు గుర్తించారు. ఇతడితోపాటు మరో వ్యకిని కూడా ఆరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.