హైదరాబాద్, ఫిబ్రవరి 5,(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యకాలంలో 3.34 లక్షల కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వాటిలో జీహెచ్ఎంసీ, పరిసర జిల్లాల్లో 1.10 లక్షలు కుకకా టు ఘటనలు ఉన్నాయని వివరించింది. రా ష్ట్ర వ్యాప్తంగా 36 మంది అమాయక ప్రజలు మృత్యువాతపడ్డారని తెలియజేసింది. వీధి కుకల నియంత్రణ కోసం ప్రత్యేక బడ్జెట్లో కేటాయింపులు వెచ్చించినట్లు హైకోర్టుకు తెలిపింది. స్టెరిలైజేషన్, వ్యాప్టికేషన్, అవగాహన, సంక్షేమ కార్యక్రమాలకు 2022-23 నుంచి 2024 డిసెంబరు వరకు రూ. 29.67 కోట్లు కేటాయించగా, రూ.9.21కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. వీధి కుకల దాడి ఘటనలపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన క్రమంలో నివేదిక సమర్పించాలని తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
జీహెచ్ఎంసీ కౌంట ర్ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది బుధవారం చెప్పడంతో పిల్‌పై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కె. ఇలంబర్తి దాఖలు చేసిన నివేదికలో వీధి కుకల్లో 80 శాతానికి స్టెరిలైజేషన్ పూర్తి చేశామన్నా రు. యాంటీ రేబిస్ వ్యాక్సిలేషన్ కూడా చేస్తున్నట్లు చెప్పారు. నయం కాని రోగాలతో బాధపడే కుకలను చట్ట ప్రకారం చంపుతున్నట్లు వివరించారు. వీధి కుకల సమాచారంతోపాటు టోల్ ఫ్రీ, హెల్ప్ లైన్, మైజీహెచ్ఎంసీ యాప్, వెబ్ పోర్టల్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు.
యాంటీరేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టడానికిగాను 5 జంతు జనన నియంత్రణ కేంద్రాలు, 18 ప్రైవేటు వెటర్నరీ డాక్టర్లు, 22 పారా వెటర్నీలు, 6 మంది షెల్టర్ మేనేజర్స్, 362 మంది కుకలు పట్టేవారితోపాటు, కుకలు పట్టడానికి 49 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. 5419 హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, మాంసం దుకాణాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు వ్యర్థ పదార్థ నిర్వహణపై నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 1.27 లక్షలు జరిమానా విధించామని తెలిపారు. వీధి కుకలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు జారీ చేసే ఉత్తర్వులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.