హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా మధిర మండలంలో వైరా రివర్ కుడిగట్టుపై ఏర్పాటుచేసిన బయ్యారం లిఫ్ట్ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.3.34కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా మధిర మండలంలోని జాలిమూడి చెరువు కుడి, ఎడమ కాల్వల మరమ్మతులకు రూ.5.23కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది.