హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం అధికారులు అక్రమంగా రెండు కిలోల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.కోటి ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ఉద్యోగి వద్ద ఈ బంగారాన్ని గుర్తించారు. విమానంలో ఆహారం అందించే వ్యక్తి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.