హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇప్పటివరకు 2,33,069 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం కాగా, లబ్ధిదారులకు రూ.2,900.35 కోట్లు చెల్లించినట్టు గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లలో 90,613 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో, 41,212 ఇండ్లు గోడలు, మరో 37,400 ఇండ్లు శ్లాబ్స్థాయిలో ఉన్నట్టు ఆయన వివరించారు. మిగిలిన 63,844 ఇండ్ల నిర్మాణం మొదలై నా వివిధ కారణాలతో నిలిచిపోయినట్టు వెల్లడించారు.
మంగళవారం 18,247 మంది లబ్ధిదారులకు రూ.202.90 కోట్లు విడుదల చేయగా, ఇప్పటివరకు మొత్తం రూ. 2,900.35 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయగా, 2.33 లక్షల ఇండ్ల నిర్మాణమే మొదలైనట్టు చెప్పారు. దీనినిబట్టి కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో మంజూరు చేసిన ఇండ్లలో ఇంకా సగం ఇండ్లు మొదలుకాలేదని తెలుస్తున్నది.