హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇం డియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రా ష్ట్రం నుంచి మరో 251 సర్కారు స్కూళ్లు ఎంపికయ్యాయి. నిరుడు 543 స్కూళ్లు ఎంపికకాగా, ఈ ఏడాది మరో 251 స్కూళ్లు ఎంపికయ్యాయి. దీంతో రాష్ట్రం లో పీఎం శ్రీ స్కూళ్ల సంఖ్య 794కు చేరిం ది. ఈ ఏడాది ఉన్నత పాఠశాలల్లో పలు స్పెషలైజేషన్లలో శిక్షణనిచ్చేందుకు రాష్ట్ర సమగ్రశిక్ష అధికారులు ప్రణాళికలు రూ పొందించారు.
65 బడుల్లో కంప్యూటర్ ల్యాబులు, 97 పాఠశాలల్లో సైన్స్ల్యాబు లు, గ్రంథాలయాలను నెలకొల్పనున్నా రు. హైస్కూల్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్తో పాటు ఏఐఎంఎల్, కోడింగ్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో తర్పీదునిస్తారు. ఆయా బడుల్లో షూటింగ్, ఫెన్సింగ్, ఆర్చరీ వంటి ఆటల్లో శిక్షణనిస్తారు.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమశాఖలో కొత్తగా వచ్చిన సర్వీసు రూల్స్ ఆధారంగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ కోరింది.
ప్రభుత్వ, పంచాయతీరాజ్ విద్యాశాఖల్లో మాదిరిగానే గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న భాషాపండితులు, పీఈటీల పోస్టులను ఉన్నతీకరించి పదోన్నతులు కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, పీ నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.