హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చాలాచోట్ల వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నది. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున క రెంటు ఇస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పంటలు కాపాడుకొనేందుకు రైతులు బావు ల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని గ్రామా ల్లో తరచూ కరెంటు వస్తూపోతుండటంతో బావుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. అరకొర కరెంటు, నీళ్ల కొరత కారణంగా రైతు లు ఈసారి వరి సాగుకు మొగ్గుచూపడం లేదు. వరికి బదులుగా మక్కజొన్న వేసేందు కు ఆసక్తిచూపుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కొందరు రైతులు మక్కజొన్న విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ పరిస్థితి
జనవరి తర్వాత కటకటే
డిమాండ్, వినియోగం పెరుగడం చూ స్తుంటే జనవరి తర్వాత వినియోగం మరింత పెరిగే అవకాశమున్నది. రాబోయే రోజుల్లో కటకట నెలకొనే పరిస్థితులున్నాయి. మంగళవారం 217 మిలియన్ యూనిట్ల వినియోగం కాగా, జెన్కో థర్మల్ స్టేషన్లల్లో 79, హైడల్ నుంచి 5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయ్యింది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లతోపాటు ఇంధన ఎక్సేంజీలో 69 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశారు. మంగళవారం 64 మిలియన్ యూనిట్లు సీజీఎస్, ఇంధన ఎక్సేంజీలో కొనుగోలు చేశారు. డిమాండ్ పెరిగితే కొనుగోలు చేయాల్సిన విద్యుత్తు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
పెరిగిన వినియోగం
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ప్రత్యేకించి డిసెంబర్ మొదటి వారం నుంచి డిమాండ్ అధికమవుతున్నది. ఈ నెల ఒకటో తేదీ వరకు వినియోగం 193 మిలియన్ యూనిట్లు ఉండగా, మంగళవారం 217కి చేరింది. ఈ నెల 2న 204, 3న 209, 4న 211 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో డిమాండ్ మరింతగా పెరిగే అవకాశమున్నది. 2024లో కూడా డిసెంబర్లోనే వినియోగం అమాంతం పెరిగింది. మొదట 198 మిలియన్ యూనిట్లు ఉండగా, మొదటి వారంలోనే 220 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారంలోనే అమాంతం పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశమున్నది.
డిసెంబర్ తొలి వారంలో పీక్ డిమాండ్ (మెగావాట్లలో..)
తేదీ : డిమాండ్
డిసెంబర్ 3 : 11,814
డిసెంబర్ 4 : 11,942
డిసెంబర్ 5 : 12,287
డిసెంబర్ 6 : 12,053
డిసెంబర్ 7 : 11,555
డిసెంబర్ 8 : 12,479