హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లోని సీట్లను భర్తీచేసే జోసా- 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఓపెన్హౌజ్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో డోర్లు తెరిచాయి. విద్యార్థులు స్వయంగా వీక్షించుకుని ఏ ఐఐటీల్లో చేరాలో నిర్ణయించుకునే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తున్నాయి.
ఇటీవల మన దగ్గర ఐఐటీ క్రేజ్ తారాస్థాయికి చేరింది. కొత్త ఐఐటీలు ఏర్పాటుకావడం, సీట్లు గణనీయంగా పెరగడంతో చాలా మంది ఐఐటీల్లో కాలుపెడుతున్నారు. దీంతో ఐఐటీ బాంబే, ఖరగ్పూర్ మద్రాస్ వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఓపెన్హౌజ్ను నిర్వహిస్తున్నాయి. బుధ, గురువారాల్లో ఐఐటీ హైదరాబాద్లో ఓపెన్హౌజ్ నిర్వహించనున్నారు. బుధవారం ఆఫ్లైన్లో నిర్వహించనుండగా, గురువారం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.