మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ఇందులో స్పిల్‌వే ద్వారా 89,976 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,749 క్యూసెక్కులు, నెట్టెంపాటు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1400 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.
ఇక జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 317.420 మీటర్లు ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ఇప్పుడు 7.498 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.